Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 23|| sumathi sathakam

సుమతి శతకం 23

మండలపాతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలుగుతా యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ!

భావం

ఒక మహారాజు వ్యవహార దక్షుడైనా మంత్రిలేకుండఁ రాజ్యతంత్రము నడుపుట కొండంత మదపుటేనుగు తొండము లేకుండా బ్రతుకు సాగించి నట్లుండును( ఏనుగునాకు తొండమే ప్రదానము అది లేనిచో దానికి బ్రతుకేలేదు అట్లే రాజినవానికి ప్రధానిమంత్రి గూడా అతడులేనిచో రాజ్యపాలనము అస్తవ్యస్తముగా నుండును ).

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *