Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకం లావుగలవాని || baddena sumathi shatakam

బద్దెన కవి సుమతి శతకం లావుగలవాని

లావుగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలోసుమతీ!

భావం

కొండంతయేనుగు కంటెను తెలివిగా దానిని వశము చేసుకొని ఎక్కి తిరుగువాడు బలవంతుడుగదా! అట్లే శరీరబలము గలవానికంటెను నైతికబలముగల వాడు బలవంతుడగును గదా!

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *