Download!Download Point responsive WP Theme for FREE!

indian traditional games Bongaralata || గ్రామీణ ఆటలు బొంగరాల ఆట

బొంగరాల ఆట

బొంగరాల ఆట మొగపిల్లలు ఎక్కువుగా ఆదుకునే ఆట. ఇందుకు ప్రత్యేకంగా బొంగరాలు తయారు చేయించుకొంటారు . చిన్నవి పెద్దవి బొంగరాలుంటాయి .బొంగరం దారం ఆధారంగా తిరుగుతుంది. ఈ దారాన్ని జాల అంటారు. జాలను బొంగరానికి చుడతారు జల జారిపోకుండా బొంగరానికి కొన్ని గీతలుంటాయి. ఆ జీతాల చుట్టూ చుట్టాలి.తరువాత జాల చివర గట్టిగ బొటనవేలుకు,చూపుడు వేలుకు మధ్య బంధించి నెల ఫై విసురుతారు. అప్పుడు బొంగరం ములికి ఆధారముగా తిరుగుతూ ఉంటుంది. దీని ఆడించటమేకాదు, దీనిపై పందాలు కూడా ఆడతారు.
ఓ గుండ్రని గీతలో బొంగరాలు ఉంచి పంటలూ వేసి ఎన్నికైనవాడు ముందుగా ఆట ప్రారంభిస్తారు.
అతను తన బొంగరం ద్వారా ఎదుటివాడి బొంగరాన్ని గీత బయటకు దాటించాలి. అప్పుడు ఆ బొంగరం అతను ఓడినట్టు లేదా ఆ బొంగరం కొట్టిన వాడి సొంతమవుతుంది. ఈ ఆటకూడా చాల చోట్ల రకరకాల పద్ధతుల్లో ఆడుతారు. ఆటలో ఒక్కసారి బొంగరం ములికి దెబ్బలు తినడమే కాదు రెండు ముక్కలు అవుతుంది. ఎన్ని నొక్కులుంటే అన్నిసార్లు ఓడినట్టు గుర్తుకూడ. ఈ ఆట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుతూ కనిపిస్తుంటారు.

మీరుకూడా ఈ అతను ఆడినట్లయితే వెంటనే share చేయండి

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *