Download!Download Point responsive WP Theme for FREE!

కోతికొమ్మచ్చి || kothi kommachi game

కోతికొమ్మచ్చి

కోతి చేష్టలు కనిపించే ఆట అంటే కోతికొమ్మచ్చి . కోతిలా గెంతడం దూకడం ఈ ఆటలో ఆనందం కలిగిస్తాయి.
చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణములో ఈ ఆట ఆడుకోవచ్చు. మగపిల్లలు ఎక్కువుగా ఆడే ఆట ఇది

ఆడే విధానం

ఉరిబయట ఓ పెద్దచెట్టును చూసుకొని చెట్టు ముందు గుండ్రని గీత పరిదిగా గీస్తారు. తరువాత ఆడుకునేవాళ్ళదరు పంటాలు( ముగ్గురు చేతులో తీసికొని ఒక్కసారి వేస్తారు కొందరు వెల్లకిలా ,కొందరు బోర్లా వేస్తారు. అదులో ఒకరు ఎటువైపు వేస్తారో వాళ్ళు పంట అయినట్టు . మిగిలినవాళ్లు కూడా ఇలాగే వేస్తారు చివరకి ఒకరు మిగులుతారు ). ద్వారా దొంగను గుర్తిస్తారు. దొంగ తప్ప మిగతా వాళ్లంతా చెట్టు ఎక్కుతారు.కింద గీత లో ఒక కర్ర పెడతారు. ఒకరు ఆకర్ర దూరంగా విసిరేస్తారు . ఆ దొంగ వెళ్లి కర్ర తెచ్చే లోపల ఆ కర్ర విసిరేసిన అతను చెట్టు ఎక్కాలి. చెట్టు ఎక్కేలోపే ఆ దంగా వచ్చి పట్టుకుంటే ఆటను దొంగ కావాల్సిఉంటుంది. దొంగ తిరిగి వచ్చి చెట్టెక్కి మిగతా వాళ్ళను పట్టుకోవాలని చూస్తాడు. వాళ్ళు కొమ్మలో కోతుల్లా అటుఇటు దొరకకుండా దూకుతారు. దొంగ మరి దగ్గరికివస్తే కింద గుండ్రని గీతలో దూకుతారు. కింద దూకేటప్పుడు చెట్టుక్కేటప్పుడు దాని లెక్కించారు. దొంగ ముట్టుకునే వరకు ఆటకనసాగుతుంది .
పల్లెటూరిలో వేసవి వస్తే అందరు ఈ అట ఆడుతుండారు.

మీరు కూడా చిన్నపుడు ఈ ఆట ఆడితే దీన్ని facebook లో share చేయండి

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *