Download!Download Point responsive WP Theme for FREE!

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం :

ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్య. పూర్వం దీనిని కుక్కే పట్నం అనే పిలిచేవారు. క్రమంగా కుక్కె సుబ్రహ్మణ్యగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది పరశురామక్షేత్రాలలో ఒకటి. కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తుటారు

స్థలపురాణం
స్కాందపురాణంలో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణం సుబ్రహ్మణ్య స్థలపురాణం గురించి చెపుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సంహరించి తన శక్తి అయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో విశ్రాంతి తీసుకొంటున్నపుడు ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా కుమారస్వామి అంగీకరిస్తాడు. ఆతరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడంవల్ల ఈ క్షేత్రం వెలసింది. ఆది శంకరాచార్యులు తన ధర్మ ప్రచార పర్యటనలో సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో “నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ” అన్నాడు.

సుబ్రహ్మణ్యస్వామి
సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి, మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *