Download!Download Point responsive WP Theme for FREE!

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు శ్రీ రఘురామా || ramadasu dasaradhi shatakam

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు శ్రీ రఘురామా || ramadasu dasaradhi shatakam

పద్యం

శ్రీ రఘురామా చారుతులసీదళ దామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరామాలలామ దు
ర్వాక కబంధరాక్షస విరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారక నామ భద్రగిరిధాశరధీ| కరుణాపయోనిధీ |

భావం
శోభాయుక్తమైన రఘువంశపురామ , మనోహరమైన తులసి యాకులమాలను ధరించినవాడా , శాంతముసహనం మున్నగు సద్గుణ ములచేగొప్పవాడ , ముల్లోకములవారిచే స్తుతింపబడు పరాక్రమసం
పద గలవాడా ,అడ్డగింప శక్యం కానీ కబంధుడనేడు రాక్షసుని నశింపజేసినవాడా , లోకములందలి వారిని పాపసముద్రమునుండి దాటించు నామముగలవాడ ,భద్రాచలరామా ,దయాసముద్రుడా

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *