Download!Download Point responsive WP Theme for FREE!

శ్రీకాళహస్తీశ్వర శతకం 03 Srikalahasteswara satakam || Dhurjati

భవకేళి మదిరా మదంబున మహా పాపాత్ముడైన వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకర్ణోరాశి పాలైన బ
ట్టవు, బాలుండొక చోట నాటతామితోడన్ నూత గులాంగ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!

భావం
జనన మరణ రూపమైన సంసార మనెడి ఆటలోబడి, కల్లుత్రాగినట్లు మత్తిక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహిపాపియై నన్ను (భగవంతుని) తెలిసికొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోవుచుండగా చూచును ఊరుకుందువా? ఆటలధోరణిలో బాలుడు నూతిలో బడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండ ఊరకుండునా? నీవు రక్షింపకుండుట న్యాయము గాదని భావము

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *