Download!Download Point responsive WP Theme for FREE!

శ్రీకాళహస్తీశ్వర శతకము 2

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు థా
రా వేగంబున మన్మనోబ్జా సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తేశ్వర!

భావం: సంపదలనెడి మెరుపుతీగలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన పాపములనెడి నీటిధారలచేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయయను శరత్కాలము వచ్చినది. చాలు ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృధులు గలవాడనై నీ చిన్ముర్తిని ధ్యానించుచు బ్రతికెదను. ( పద్మములు వానదెబ్బకు వాడిపోవును . శరత్కాలములో వికసించి కాంతివతములగును).

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *