Download!Download Point responsive WP Theme for FREE!

శ్రీకాళహస్తీశ్వర శతకము 3

వాణివల్లభ దుర్లభంబగు భావద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీ జెఱపట్ట జూచిన విచారద్రోహమో, నిత్య క
ణ్యాణ క్రీడల బాసి, దుర్ధశలపాలై, రాజలోకధామ
శ్రేణి, ద్వారము దూర జేసి తిప్పుడో శ్రీ కాళహస్తీశ్వరా !

భావం: ఈశ్వరా! బ్రహ్మాదులకు గూడ అలభ్యమైన నీ ఇంటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టుద మను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో యేమోకాని, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు గదా!

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *