Download!Download Point responsive WP Theme for FREE!

శ్రీకాళహస్తీశ్వర శతకము -4

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
బ్రాంతిజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడుఁ గదా, శ్రీ కాళహస్తేశ్వర!

భావం: ఆలోచించినచో ఈ జగత్తంతయును మాయయేగదా! మానవుడు అ సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, దానములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనస్సులో ఒక్క నిమిషమైనను ధ్యానించడు గదా! ఎంత అజ్ఞానము !

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *