Download!Download Point responsive WP Theme for FREE!

వేమన శతకం వేమన పద్యాలు || vemana padyalu || staytuneindia.com

ఆత్మయందె ద్రుష్టి ననువగా నొనరించి
నిశ్శలముగ ద్రుష్టి నిలిపెనేని
అతడునీవే సుమ్మి యనుమానామేలరా
విశ్వదాభిరామ వినురవేమ

భావం
మనస్సును ఆత్మయందే ఉంచి చలించని ఏకాగ్రతతో వీక్షించినచో మోక్షము నొందగలవు .గురుపదేశమువల్లనే నిది సాధపడును

ఇహపరంబులకును నిడిసాధనంబని
వ్రాసి, చదవి ,విన్నవారికెల్ల
మంగళంబు లోనరు మహిలోనిది నిజము
విశ్వదాభిరామ వినుర వేమ

భావం

ఇట్లు నీతిమార్గమును బోధించు ఈ శతకము ,ధర్మార్ధకామ మోక్షములనెడి పురుషార్థములు
సాధించుటకు సాధనమై ,వ్రాసినవారికిని,చదివినవారికిని గూడ ఇహపరలోక సౌఖ్యములను
సర్వశుభములను ఇచ్చును

గురువుతనయినను హరునితజూపును
బ్రహ్మలోకమితడు పాణజూపు
శిశ్యునరసితట్టి చీకటిబాపురా
విశ్వదాభిరామ వినుర వేమ

భావం

నిజమైన గురువు శిష్యునికి బ్రహ్మలోకమును ,శ్రీహరిని కూడా చూపించగలడు .శిష్యుని భుజముతట్టు
ధైర్య సాహసములను నేర్పుతూ అతని అజ్ఞానాంధకారమును తొలగించును

అప్పులేనివాడే యధిక సంపన్నుడు
తప్పులేనిలువారు ధరణిలేరు
గొప్పలేని బుద్ది కొంచెమై పోవురా
విశ్వదాభిరామ వినురవేమ

భావం
అప్పులు చేయని వాడె గొప్పభాగ్యవతుడు ,తప్పు చేయని వారు ధరణిలో లేరు .అప్పుచేయుట
గొప్ప తప్పు. దాని వలన గౌరవము నశిచును ,అందరిలోనూ చులకనయిపోదురు

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *